Site icon NTV Telugu

MLA Seethakka: ధరణి పోర్టల్ తంటాలను తెంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

Mla Seethakka

Mla Seethakka

MLA Seethakka: ధరణి పోర్టల్ తంటాలను తెంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు మునుగోడు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. దేశ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర అని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యడమే బీజేపీ లక్ష్యమన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న బీజేపీకి దేశ ప్రజలు బుద్ది చెప్పాలని సీతక్క తెలిపారు. ములుగు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సెప్టెంబర్ 1 న పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. జోడో యాత్ర వాల్ పోస్టర్ ను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క ఆవిష్కరించించారు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రములో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 23 న తెలంగాణలో మొదలైన సందర్భంగా మన ములుగు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నవంబర్ 1 న పెద్ద ఎత్తున హైదరాబాద్ గొచ్చిబౌలికి తరలి రావాలి రాహుల్ గాంధీకి మద్దతు తెలుపాలని కోరారు.

Read also: Munugode Bypoll: ఫైనల్‌గా గెలిచేది టీఆర్ఎస్సే..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రతి గడప నుంచి ఈ యాత్రలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చొరవ చూపాలని కోరారు. బీజేపీ పాలనలో దేశంలో పెరుగుతున్న రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారు. భారత్ జోడోయాత్ర దేశంలో చారిత్రాత్మకంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. మత, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ఆర్థిక సంపదను కొద్ది మందికే దోచిపెడుతున్న దేశంలోని కార్పొరేట్ పరిపాలనకు స్వస్తి పలకడానికే రాహుల్ భారత్ జూడో యాత్ర చేపట్టారన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాదని స్పష్టం చేశారు. దేశ జాతి ఐక్య నిర్మాణానికి చేస్తున్న యాత్ర భారత్ ఔన్నత్యాన్ని కాపాడటం కోసమే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని సీతక్క అన్నారు.
Ranga Reddy Crime: అప్పు తిరిగి ఇవ్వకుంటే శవాన్ని ఇంట్లోనే ఖననం చేస్తాం

Exit mobile version