MLA Seethakka: పేపర్ లీకేజ్‌లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Seethakka Sensatioal Comments On TSPSC Paper Leak Issue: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ఈ పేపర్ లీకేజ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా గాంధీ భవన్‌లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం తమ వారి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిలో కూడా ఇలాగే అవకతవకలు జరిగాయన్నారు. లాంగ్ జంప్ తగ్గించాలని ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు పోరాటం చేస్తున్నా.. ఫలితం లేదన్నారు.
IND vs AUS 1st ODI: భారత బౌలర్ల తాండవం.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్
Also Read
- Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
- CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
ఈ పేపర్ లీకేజ్‌లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్న సీతక్క.. ఎగ్జామ్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాదని, అభ్యర్థులకు వచ్చిన మార్కుల లిస్ట్‌ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మధ్యం, పబ్స్, బెల్ట్ షాపుల్లో మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వమే యువతను మద్యానికి బానిస చేస్తోందని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజ్‌తో టీఎస్‌పీఎస్‌సీపై నమ్మకం పోయిందని, ఈ లీకేజ్‌లో అధికార పార్టీ లీడర్ల పాత్ర ఉంది కాబట్టే మార్కుల లిస్ట్‌ని బయటపెట్టడం లేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువతను మభ్యపెడుతున్నాయన్నారు. యువతకు ఆశ పెట్టి, కోచింగ్ సెంటర్‌ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. యువతకు పోరాడితే పోయేదేం లేదని.. ఆత్మహత్యలు శరణ్యం కాదని సీతక్క సూచించారు.
SSMB29: ఎక్కించండి.. ఎక్కించండి.. ఇంకా హైప్ ఎక్కించండి
అంతకుముందు కూడా.. కేసీఆర్‌లాగా తాము బోగస్ మాటలు చెప్పమంటూ, కరీంనగర్ బహిరంగ సభలో సీతక్క ధ్వజమెత్తారు. సోనియా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారని గుర్తు చేసిన ఆమె.. మతం మత్తలో ముంచే బీజేపీతో, మద్యం మత్తులో ముంచే బీఆర్ఎస్ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్పు కోసం కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ సీతక్క కోరారు. రాష్ట్రమంతా మద్యంపై వచ్చే ఆదాయంతోనే నడిచే దుస్థితి నెలకొందన్నారు.
- Tags
తాజావార్తలు
-
China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే…! IVF ముసుగులో ఇంత దారుణమా
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
ట్రెండింగ్
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!