Rega Kantha Rao: బీజేపీ చావు కబురు చల్లగా చెప్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rega Kantha Rao Fires On BJP Over Bayyaram Project: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీజేపీపై ధ్వజమెత్తారు. కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టడం లేదని బీజేపీ చావు కబురు చల్లగా చెప్తోందని మండిపడ్డారు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన వనరులు లేవని చెప్తున్నారన్నారు. మరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏం వనరులు ఉన్నాయని విశాఖ ఉక్కు పరిశ్రమ పెట్టుకున్నామని ప్రశ్నించారు. అసలు ఖనిజమేలేని విశాఖ స్టీల్స్.. 500 కి.మీ దూరం నుండి ఖనిజాన్ని, బొగ్గును, డోలమైట్‌ను తెచ్చుకొంటూ లాభాలు గడిస్తోందని.. గడిస్తుంటే అన్ని వనరులున్న బయ్యారంలో సాధ్యం కాదని చెప్పడం హాస్యాస్పదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఒక్క పని కూడా చేయని కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల ఒక్క ఉపయోగం లేదని.. అలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత? అని ఎద్దేవా చేశారు.
చట్టబద్దంగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేగా కాంతారావు అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం కొట్లాడి సాధించాల్సిన స్థానంలో వున్న కిషన్ రెడ్డి.. పరిశ్రమ సాధ్యం కాదని చెప్పటం సిగ్గు చేటని మండిపడ్డారు. కేంద్రమంత్రి నిస్సహాయ మంత్రిగా ఉన్నారన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి తన ప్రకటనను వెనక్కు తీసుకొని.. కేంద్రాన్ని ఒప్పించి, బయ్యారం ఉక్కు పరిశ్రమను తీసుకు రావాల్సిందేనని నిలదీశారు. తెలంగాణ హక్కును హరించే విధంగా వ్యవహరించటం ఏమాత్రం సరికాదన్నారు. తెలంగాణా ప్రజానీకానికి మోది క్షమాపణలు చెప్పి.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ద్వారా ఇవ్వాల్సిన ఉక్కు పరిశ్రమ ఇవ్వలేమని బీజేపీ చెప్పడం.. తెలంగాణపై ఆ పార్టీకి ఉన్న అభిప్రాయం ఏంటో అర్థమవుతోందని చెప్పారు.
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?