MLA Rajasingh wife meet to Governor Tamilasai: గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ సతీమణి టి.ఉషా బాయి ఆయన సోదరీమణులతో కలిసి ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసైను కలిసిసారు. తన భర్త రాజాసింగ్ ను పిడి యాక్ట్ పెట్టి, అక్రమంగా అరెస్టు చేసినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య ఉషా బాయి మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిరాధార ఆరోపణలపై ప్రభుత్వ ఒత్తిడితో అనేకసార్లు కేసులు బుక్ చేసి, తన భర్తను నిర్బంధించారని ఆరోపించారు. అయితే..రాజా సింగ్ న్యాయం కోసం న్యాయస్థానంలో పోరాడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలను రుజువు చేయలేక పోవడంతో రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు భిన్నమైన వైఖరిని అవలంబించిందని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మోపిన పిడి యాక్ట్‌ను కొట్టివేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఉషా బాయి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను అభ్యర్థించారు.
ఇటీవల స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. ఈ షోను అడ్డుకుంటామని బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫరూఖీ షోకు భారీ భద్రను కల్పించింది రాష్ట్రప్రభుత్వం. పెద్ద ఎత్తున పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. ఆందోళనలకు పాల్పడిన బీజేపీ, ఇతర హిందూ సంస్థల నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో హిందూ దేవతలను అవమానపరుస్తూ మాట్లాడిన మునావర్ ఫరూఖీ షోకు ఎలా పర్మిషన్ ఇస్తారని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో హైదరాబాద్ పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పరిణామాల మధ్య.. రాజాసింగ్ భార్య తన భర్తను విడుదల చేయించాలంటూ గవర్నర్ ను కలవడం సంచళనంగా మారింది. మరి దీనిపై గవర్నర్ తమిళిసై ఎలాంటి ఆక్సన్ తీసుకోనున్నారు అనేది సంచళనంగా మారింది. రాజా సింగ్ బయటకు వస్తారా? బయటకు రాడా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టంట్స్ చూశారా..?