Site icon NTV Telugu

Raghunandan Rao : ఈ రోజు జరిగిన ఘటనలకు కారణం జగ్గారెడ్డి

Raghunandan Rao

Raghunandan Rao

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. భాగ్యనగరం కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనగాలో అట్టుడికిపోయింది. నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ ముట్టిడికి యత్నించగా.. పోలీసులు వారి పథకాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌ సర్కిల్‌ వద్ద బైక్‌కు నిప్పుపెట్టి కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అంతేకాకుండా బస్సు అద్దాలు పగులగొట్టారు.

ఇప్పటికే పోలీసులు కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేప ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన ఘటనలకు కారణం జగ్గారెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్పాన్సర్డ్ ప్రోగ్రాం అంటూ ఆయన సెటైర్లు వేశారు. మోడీనీ కూడా సీఎంగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ చేసిందని, కేటీఆర్ ఈడీ అంటేనే ఉలిక్కి పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల ఉమ్మడి టార్గెట్ ఈడీ అని ఆయన వ్యాఖ్యానించాఉ. అంత జరిగినా పోలీస్ ఇంటిలిజెన్స్ ఏమి చేస్తుందని రఘునందన్‌ రావు ప్రశ్నించారు.

Exit mobile version