NTV Telugu Site icon

MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నేడు విచార‌ణ

Mla's Purchase Case

Mla's Purchase Case

MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా. ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది. అయితే సీబీఐ రంగంలోకి దిగుతుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read also: Rain Alert: ఓవైపు జల్లులు మరోవైపు చలి.. రాష్ట్రానికి వర్షసూచన ఎన్ని రోజులంటే?

ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని, అలాంటప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయడంలో తప్పులేదని కోర్టుకు తెలిపారు. అయితే.. కోర్టుకు నివేదిక అందజేసిన చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుందని, ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేసీఆర్‌ మీడియా ముందు ప్రకటించారన్నారు. అయితే.. వాదనలు విన్న అనంతరం.. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే కు నిరాకరించి.. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ చేతికి హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ అందింది. ఏక్షణమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సీబీఐ. అయితే.. మొయినాబాద్‌ పీఎస్‌ ఎఫ్ఐఆర్‌ను సీబీఐకి బదిలీ చేసింది హైకోర్టు. దీంతో.. క్రైం నెంబర్ 455/2022 ఆధారంగా కేసు నమోదు చేయనుంది సీబీఐ. ఇప్పటికే సిట్ దర్యాప్తును రద్దు చేసింది హైకోర్టు. సింగిల్ బెంచ్ ఆర్డర్ కాఫీనీ సీబీఐ న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏసెక్షన్స్ కింద కేసులు నమోదుచేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.
Kamareddy Bandh: నేడు కామారెడ్డి బంద్‌.. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు