Pilot Rohith Reddy: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Pilot Rohith Reddy To Attend ED Interrogation Again: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న (సోమవారం) ఆరు గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు, ఈరోజు 10:30 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈసారి వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో విచారణకు హాజరు కావాలని.. తాము ఇచ్చిన ఫార్మాట్‌లోనే వివరాలు అందజేయాలని ఈడీ కోరింది. నిన్న విచారణలో భాగంగా విదేశీ టూర్లు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ఇచ్చిన రోహిత్ రెడ్డి.. నేడు తన విద్యార్హతలు, తనపై నమోదైన కేసుల వివరాలను ఈడీ ముందు ఉంచనున్నారు. ఇప్పటికే ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డులను ఈడీ అధికారులకు ఇచ్చారు. అయితే.. తనని ఏ కేసులో విచారణ జరుపుతున్నారో తనకు తెలియదని, కేవలం విచారణకు సహకరించాలనే మాట తప్ప మరో మాట ఈడీ అధికారులు చెప్పడం లేదని రోహిత్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు.. నేడు విచారణలో ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.
Hawaii Flight Turbulence: విమానాన్ని కుదిపేసిన బలమైన గాలులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
కాగా.. ఎమ్మెల్యేల ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డికి ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. మీరు అడిగిన వివరాలన్నీ తీసుకురావడం కోసం తనకు కొంత సమయం కావాలంటూ రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు పీఏ ద్వారా లేఖ పంపించారు. తాను అయ్యప్ప మాలలో ఉన్నానని, శబరిమలకు కూడా వెళ్లాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. డిసెంబర్ 31 తర్వాత తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. కానీ.. ఈడీ అధికారులు మాత్రం విచారణకు రావాల్సిందేనని తిరిగి లేఖ పంపడంతో, ఆయన 3 గంటలకు విచారణకు హాజరయ్యారు. ఆరు గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ అనంతరం.. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందున సమయం కోరానని, కానీ కచ్ఛితంగా హాజరుకావాలని ఈడీ చెప్పడంతో తాను విచారణకు వచ్చానని చెప్పారు.
Police Training: వరంగల్‌లో విషాదం.. పోలీస్ నియమకాల్లో అస్థస్థతకు గురై, అభ్యర్థి మృతి
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!