NTV Telugu Site icon

Pilot Rohith Reddy: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

Mla Pilot Rohith Reddy

Mla Pilot Rohith Reddy

MLA Pilot Rohith Reddy To Attend ED Interrogation Again: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. నిన్న (సోమవారం) ఆరు గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు, ఈరోజు 10:30 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈసారి వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో విచారణకు హాజరు కావాలని.. తాము ఇచ్చిన ఫార్మాట్‌లోనే వివరాలు అందజేయాలని ఈడీ కోరింది. నిన్న విచారణలో భాగంగా విదేశీ టూర్లు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ఇచ్చిన రోహిత్ రెడ్డి.. నేడు తన విద్యార్హతలు, తనపై నమోదైన కేసుల వివరాలను ఈడీ ముందు ఉంచనున్నారు. ఇప్పటికే ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డులను ఈడీ అధికారులకు ఇచ్చారు. అయితే.. తనని ఏ కేసులో విచారణ జరుపుతున్నారో తనకు తెలియదని, కేవలం విచారణకు సహకరించాలనే మాట తప్ప మరో మాట ఈడీ అధికారులు చెప్పడం లేదని రోహిత్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు.. నేడు విచారణలో ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.

Hawaii Flight Turbulence: విమానాన్ని కుదిపేసిన బలమైన గాలులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

కాగా.. ఎమ్మెల్యేల ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డికి ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. మీరు అడిగిన వివరాలన్నీ తీసుకురావడం కోసం తనకు కొంత సమయం కావాలంటూ రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు పీఏ ద్వారా లేఖ పంపించారు. తాను అయ్యప్ప మాలలో ఉన్నానని, శబరిమలకు కూడా వెళ్లాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. డిసెంబర్ 31 తర్వాత తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. కానీ.. ఈడీ అధికారులు మాత్రం విచారణకు రావాల్సిందేనని తిరిగి లేఖ పంపడంతో, ఆయన 3 గంటలకు విచారణకు హాజరయ్యారు. ఆరు గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణ అనంతరం.. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందున సమయం కోరానని, కానీ కచ్ఛితంగా హాజరుకావాలని ఈడీ చెప్పడంతో తాను విచారణకు వచ్చానని చెప్పారు.

Police Training: వరంగల్‌లో విషాదం.. పోలీస్ నియమకాల్లో అస్థస్థతకు గురై, అభ్యర్థి మృతి