NTV Telugu Site icon

Kadiyam Srihari: బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు.. కేటీఆర్, కవితలకే ఎక్కువ

Kadiyam Srihari

Kadiyam Srihari

ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ‘అధికారం లేకపోవడంతో… బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పదవి, అధికారం లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు బిఆర్ఎస్ శ్రేణులకు లేదు అని మండిపడ్డారు. పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read: Zee 5 : ఓటీటీలో అదరగొట్టేస్తోన్న మిసెస్

ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు వింత జబ్బు సోకిందనే అనుమానం కలుగుతోంది. వింత జబ్బు ఎక్కువగా కేటీఆర్, కవితలకే ఉన్నది అని కడియం తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత… ఇప్పుడు బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కడియం ఎద్దేవ చేశారు.