బీజేపీ నేతలపై మండిపడ్డారు ఎమ్మెల్యే జోగు రామన్న. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ మోడీని ప్రశ్నిస్తే ఈడీ నోటీసులు, ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. మోడీ కి ,ఈ డీ కీ భయపడని నేత కేసిఆర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ లో బీఆర్ ఎస్ లో చేరిక సభలో ఎమ్మెల్యే జోగు రామన్న ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులను, నరేంద్ర మోడీని విమర్శించే వారిపై సీబీఐ, ఈడీ ల పేరుతో భయభ్రాంతులను గురి చేస్తున్నారు. అలాంటి బెదిరింపులకు తలొగ్గని ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. బీఆర్.ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రస్తుతం భారతదేశానికి ఎంతో అవసరమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఇందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Read Also: Drinking Alcohol: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆల్కహాల్ తాగేవాళ్లకు అమ్మాయిలను ఇవ్వకండి
ఈ సందర్భంగా చించుఘాట్ కు చెందిన బిజెపి గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి పరశురామ్ తో పాటు రామ్ చందర్ పటేల్ పలువురు గ్రామ యువకులు బీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ దేశంలో బీజేపీ నాయకులను, నరేంద్ర మోడీని విమర్శించే వారిపై సీబీఐ, ఈడీల పేరుతో భయభ్రాంతులను గురి చేస్తున్నారని అన్నారు. కానీ అలాంటి బెదిరింపులకు తలొగ్గని ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి మద్దత్తు లభిస్తోందని అన్నారు. కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మతతత్వ రాజకీయాలు పెరిగిపోవడంతో పాటు నిత్యావసర ధరలు ఆకాశానికి పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజరెడ్డి, ఆదిలాబాద్ రూరల్ మండలం ఎంపీపీ గండ్రత్ రమేష్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కుంర్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ రమేష్,నాయకులు మెట్టు ప్రహ్లాద్, సెవ్వ జగదీష్ యాదవ్, రమణ, కుంర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.