NTV Telugu Site icon

రేవంత్‌ రెడ్డిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇద్దరం ఒక్కటే.. కానీ..!

ఈ మధ్యే రేవంత్‌రెడ్డిపై సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు లేఖ రాసిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని మార్చాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని ఆ లేఖలో ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది.. అయితే, ఇప్పుడు రేవంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి..

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పంచాయతీ కామన్‌ అన్నారు జగ్గారెడ్డి.. పార్టీ పరంగా రేవంత్‌రెడ్డి మంచి పనులు చేస్తే ప్రశంసిస్తామన్న ఆయన.. పొరపాట్లు జరిగితే ప్రశ్నిస్తామన్నారు. అయితే, తాను అధిష్టానానికి రాసిన లేఖ ఎక్కడి నుంచి లీక్‌ అయ్యిందో తెలియదన్నారు జగ్గారెడ్డి.. కానీ, తాను పార్టీకి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. హైదరాబాద్‌ ఎవరి జాగీరు కాదని.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తాను ఎక్కడికైనా వెళ్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని స్పష్టం చేశారు. రేవంత్ నీ నేను.. నన్ను రేవంత్ అనుకుంటాం.. కానీ, శత్రువు మీద యుద్ధం చేసేటప్పుడు ఇద్దరం ఒక్కటే అన్నారు జగ్గారెడ్డి.