MLA Dharma Reddy: రైతులకు మేలు చేయాలన్న బీఆర్‌ఎస్ కృషి ఫలించిందని.. గతంలోలాగే ప్రతి రైతుకూ రైతుబంధు ఇస్తున్నట్లు పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఇవాళ సంగెం మండలం కాపులకనపర్తి గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయం పటాపంచలు అయ్యిందని తెలిపారు. రైతుబంధుకు లైన్ క్లియర్ అయ్యిందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఫలించిందని.. మంగళవారం నుంచి పంపిణీకి చర్యలు మొదలు అవుతాయని తెలిపారు. రైతులకు మేలు చేయాలన్న బీఆర్‌ఎస్ కృషి ఫలించిందని, రైతులకు కీడు చేయాలనుకున్న కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయని, యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంపిణీకి లైన్‌క్లియర్ అయిందని అన్నారు. రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిందని చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలుచేసిన ఈసి నిర్ణయం చెంప పెట్టులాంటిదని అన్నారు.
Read also: Yogi Adityanath: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు..!
60 ఎండ్ల పాలనలో కూడా ప్రజల కష్టాలను,రైతులను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఈ నెల మంగళవారం నుంచి రైతుబంధు డబ్బులు రైతులకు అందుతాయని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపి మూడోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని అన్నారు. సంగెం పల్లారుగుడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. పదవి మీద వ్యామోహంతో.. నర్సంపేటలో చెల్లని వ్యక్తి, తెలంగాణ ద్రోహి, అహంకారపు మాటలు మాట్లాడుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డిని మూడో తేదీ తర్వాత తగిన బుద్దిచెప్పాలన్నారు. నర్సంపేటకి తిరిగి సాగనంపడానికి పరకాల ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. పార్టీలో చేరిన వారు వారి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Purandeswari: రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తుంది..