Site icon NTV Telugu

Hyderabad: మిధానిలో అడ్డంగా దొరికిన ఇంటి దొంగలు

Thif

Thif

ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్టుకోలేడు అనే సామెతను మ‌నం ఎప్పుడూ అంటుంటాము. ఇంట్లోనే చోరీకి పాల్ప‌డి ఏమీ తెలియ‌న‌ట్లు ల‌బోదిబో మంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యంచ‌డం అన్న‌మాట‌. అదికాస్త కేసు న‌మోదు చేసుకున్న పోలీసుల‌కు త‌ల‌పెట్టునేంత ప‌ని అవుతుంది. ఆ కేసును ఛేదించ‌డానికి అనేక రకాలుగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తారు. అయితే ఆ వ‌స్తువు ఇంటిలోనే వుంటే..

ఇలాంటి ఘ‌ట‌నే కొద్దిరోజుల క్రితమే జ‌రిగింది. హైదరాబాద్ లోని ఓ మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన డైమండ్‌ నెక్లెస్‌ పోయింది. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్లెస్‌ ఇంట్లోనే దొరికిందంటూ తిరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలాంటి ఘ‌ట‌నే మిధానిలో మ‌రొక‌టి చోటుచేసుకుంది.

మిధానిలో ఇంటి దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఏజీఎం కానిస్టేబుళ్లు సామాన్లు విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆరుగురు మిధాని అధికారులు, సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. కంచన్‌బాగ్ మిధాని నుంచి సీబీఐ కార్యాలయానికి నిందితులను తరలించారని సమాచారం.

Viral News : బకెట్‌ నీళ్ల కావాలన్నా.. బావిలోకి దిగాల్సిందే..

Exit mobile version