Smita Sabharwal : తెలంగాణ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్ట్‌లో స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై రివ్యూ చేసినట్లు పేర్కొంది. ఆమె మూడు బ్యారేజీలను స్వయంగా సందర్శించిందని, ఆ సందర్శనల ఫోటోలు కూడా రిపోర్ట్‌లో పొందుపరిచింది. అదనంగా, పలు జిల్లాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్‌ను అప్పటి ముఖ్యమంత్రికి స్మితా సబర్వాల్ చేరవేసిందని కమిషన్ రిపోర్ట్‌లో పేర్కొంది.
Betel Leaf Benefits: ఆకే కదా అని తీసి పారేయకండి.. దివ్యౌషధం!
ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్న సమయంలో, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మితా సబర్వాల్ కీలకపాత్ర పోషించారని కమిషన్ గుర్తించింది. నిజనిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని రిపోర్ట్‌లో సూచించింది. అయితే, పీసీ ఘోష్ కమిషన్ తనకు వివరణ ఇవ్వడానికి 8B, 8C నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల్ హైకోర్టులో పేర్కొన్నారు. ఆ అవకాశాన్ని ఇవ్వకుండానే తన పేరు రిపోర్ట్‌లో చేర్చడం అన్యాయం అని వాదించారు. దీంతో, కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు.
Betel Leaf Benefits: ఆకే కదా అని తీసి పారేయకండి.. దివ్యౌషధం!
