Site icon NTV Telugu

Hyderabad Crime: మీర్ పేటలో దారుణం.. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad Crime: ఆడపిల్లలపై ఆత్యాచారాలు ఆగడం లేదు. కామాంధుల కామానికి ఆడవారు బలవుతున్నారు. అధికారులు ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా ఆడవారిపై ఆత్యాచారాలు మాత్రం ఆడ్డుకట్టపడటంలేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు పసువుల్లా వారిపై పడి కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని మీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారు. ఈఘటన భాగ్యనగరంలో సంచళనంగా మారింది.

Read also: Astrology : నవంబర్‌ 08, మంగళవారం దినఫలాలు

మీర్ పేట పీ.ఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. 9వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంటి నుంచి స్నేహితు రాలు ఇంటికి బయలు దేరింది. ఇప్పేడే వస్తా అంటూ బయటకు వెళుతున్న బాలికను కొందరు గమనించారు. ఆమెపై కొంతకాలంగా కన్నేసిన కామాంధులు ఇదే సమయం అని భావించి ఆబాలికను కిడ్నిప్‌ చేశారు. ఖాళీ ప్రాంతం కోసం బాలికను మూడు గంటల పాటు బైక్ పై పలు ప్రాంతాలకు నిందితులు తిప్పారు. అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో ఎవరూలేరి ఖాళీ ప్రాంతంలో బాలికపై అత్యాచారం చేశారు. ఒకరు బాలిక కదలకుండా చేతులు పట్టుకున్నారు, మరోనిందితుడు ఆబాలికను అత్యాచారం చేశాడు. ఇక రెండో నిందితుడు అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా బాలిక కేకలు వేస్తూ, గట్టిగా అరవడంతో ఘటనా స్థలికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బాలికను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుతో యువకులపై అత్యాచారం, కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. విషయం బయటకు చెబితే.. చంపేస్తామని బాధిత బాలికను నిందితులు బెదిరించారని పేర్కొంది. నిందితుల్లో ఒక యువకుడు గత కొద్ది రోజులుగా బాధిత బాలికను వెంబడిస్తున్నట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు.
Lunar Eclipse Effect On Your Zodiac Sign: చంద్రగ్రహణం.. ద్వాదశ రాశులపై ప్రభావం.. జాగ్రత్తలు – పరిహారాలు

Exit mobile version