మహబూబాబాద్ జిల్లా జిల్లాలో ఇప్పటికే మైనర్ బాలికను అత్యాచారం… హత్య చేసిన ఘటన 24 గంటలు గడవకముందే…. మరో మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం చేసిన సంఘటన జిల్లాలో వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు బాబు నాయక్ తండాలో ఓ మైనర్ బాలికను… అదే తండాకు చెందిన భూక్యా.అమృతం అలియాస్ దాదా అనే యువకుడు 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు.బాలిక పెళ్లిచేసుకోవాలని నిలదీయడంతో పెద్దమనుషుల ముందు పంచాయతీ చేసుకుందామని 3 రోజులు గా తిప్పిస్తు…రాజీ పడాలని పెద్దమనుషులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన మైనర్ గర్భిణీ వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది.స్థానికులు గమనించి ఆ గర్భిణిని కాపాడి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.పట్టణ పోలీసులు గర్భవతిని చేసిన యువకుని పై ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.