Site icon NTV Telugu

Minor Love: కాకినాడలో అదృశ్యం.. హైదరాబాద్‌లో మృతి

Minor Girl

Minor Girl

కాకినాడలో అదృశ్యమైన ఓ బాలిక సికింద్రాబాద్‌లో శవమై కనిపించింది.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం కాగా.. చికిత్స పొందుతూప్రాణలు వదిలింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ఎల్లంగిరి ప్రాంతనికి చెందిన మైనర్ బాలిక.. తెనాలికి చెందిన హరికృష్ణతో చనువుగా ఉండేది.. రెండు వారాల క్రితం ఇద్దరు.. ఇళ్లు వదిలి సికింద్రాబాద్ చేరుకోగా.. మారేడుపల్లిలో అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరిని.. స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.. వారి వద్ద ఉన్న అడ్రస్ ల ఆధారంగా ద్రాక్షారామం పోలీసులకు సమాచారం అందించగా.. ద్రాక్షారామంలో మిస్సింగ్ అయిన బాలికగా గుర్తించారు..

Read Also:Karate Kalyani: అజ్ఞాతం వీడిన కరాటే కల్యాణి.. సంచలన వ్యాఖ్యలు..

వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించగా… ఇక్కడికి వచ్చి చూసేసరికి కొన ఊపిరితో చికిత్సపొందుతూ ప్రాణలు వదిలింది ఆ బాలిక.. కాగా, ఇద్దరి మధ్య చనువు కాస్తా ప్రేమగా మారాగా.. పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినట్లు కుటుంబీకులు తెలపగా.. ఇద్దరు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.. ప్రస్తుతం బాలిక మృతిచెందగా.. ఆస్పత్రిలో హరికృష్ణ చికిత్సపొందుతున్నాడు. అయితే, తమ కుతురిని ప్రేమ పేరుతో తీసుకొని వచ్చి పురుగుల మందు తాగించి హత్య చేశాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా.. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని తల్లి దండ్రులకు అప్పజెప్పారు పోలీసులు.

Exit mobile version