Site icon NTV Telugu

Vemula Prashanth Reddy: ముందస్తు ఊసేలేదు.. ఆ అవసరం బీఆర్ఎస్‌ కు లేదు

Prashanth

Prashanth

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ లో బీజేపీ నేతలపై మండిపడ్డారు. తాము ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదన్నారు. ఆ అవసరం బి.ఆర్.ఎస్. కు లేదన్నారు. పూర్తి కాలం అధికారంలో ఉంటాం అనీ, రేవంత్, బండి సంజయ్ కు ఇంకా 9 నెలల కాలం ఉంది …ప్రజల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోండని సలహా ఇచ్చారు. ఎంపీ అరవింద్ తనను బేవ కూఫ్ అన్నారు, ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞత కు వదిలేస్తున్నా అన్నారు. రాజకీయాల కొసం ఎంపీ అరవింద్ కులమతాల మధ్య, యువత మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

రాజకీయనేతలు ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఉండాలని, మతాల మధ్య చిచ్చుపెట్టడం కాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ అరవింద్‌కు సూచించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పార్టీలు,రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని అన్నారు.

పసుపు బోర్డు తీసుకువస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి , రైతులను మోసం చేసిన ఘనత అరవింద్‌కే దక్కుతుందని’ దుయ్యబట్టారు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఇప్పించినట్లుగానే అర్వింద్ కూడా ప్రధాని నుంచి పీఎంఆర్ఎఫ్ ఇప్పించాలని అడిగితే వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కు సైకిల్ మోటార్ ఉన్న కుటుంబం అర్హులు కారని కేంద్రం సవాలక్ష ఆంక్షలు పెట్టిందని విమర్శించారు.

ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ ఎన్నోరెట్టు మెరుగైందని మంత్రి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 10 వేల మందికి రూ. 40 కోట్లు ఇప్పించానని సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఇప్పించానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులపై అరవింద్‌ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అరవింద్‌ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు మరోసారి అలాంటి పొరపాటు చేయరని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Postmartem Building: నెరవేరని మంత్రి హరీష్ రావు హామీ…నేలమీద డెడ్ బాడీలు

Exit mobile version