NTV Telugu Site icon

ఏం చేయాలో కేసీఆర్‌ తెలుసు.. మీరేం చేస్తారో చెప్పండి..!

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. ఆ దీక్షకు కాంగ్రెస్‌ కూడా మద్దతు ఇస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. తెలంగాణ కోసం ఏం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్న ఆయన.. దీక్షలు చేయాలని మాకు చెప్పడం కాదు.. ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ఇక, తెలంగాణకి అవసరమయ్యే మల్లన్న సాగర్ పై కాంగ్రెస్‌ పార్టీ 300 కేసులు వేసిందని మండిపడ్డ ఆయన.. మరి అన్యాయం జరిగే పోతిరెడ్డిపై ఏం చేస్తారని నిలదీశారు. మరోవైపు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చట్టప్రకారం టీఆర్‌ఎస్‌లోకి వచ్చారన్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి అవసరముంటే చట్టపరంగానే ఏమైనా చూసుకోవాలని సలహా ఇచ్చారు. కాగా, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం అయిన తర్వాత.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసి హాట్‌ కామెంట్లు చేయడం.. దానికి వాళ్లు కౌంటర్‌ ఇవ్వడం.. ఇక, రేవంత్‌, కాంగ్రెస్‌ నేతలు తమ వ్యాఖ్యల్లో మరింత పదునుపెంచిన సంగతి తెలిసిందే.. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా అదేస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.