Site icon NTV Telugu

Vemula Prashanth Reddy: బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు.. ఇది కేసీఆర్‌ అడ్డా

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy: నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసీఆర్‌ ఒక్కరే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీని హెచ్చరించారు. అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి అన్నారు. బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు ఇది కేసీఆర్‌ అడ్డా అని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. వీరి కుట్రలను భగ్నం చేసి తెలంగాణ ప్రజలకు వారి నిజస్వరూపాన్ని తెలియజేసామని అన్నారు. నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే, అందుకే ఆయనను బీజేపీ టార్గెట్ చేసిందని అన్నారు. నిఖార్సయిన తెలంగాణ బిడ్డలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా వారు అమ్ముడుపోరని అన్నారు.

Read also: AP Capitals: విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలి.. అదే మా కోరిక

బిడ్డా… కేసీఆర్ అడ్డాలో మీ ఆటలు సాగవు అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి బిజెపి నేతలను హెచ్చరించారు. అయితే.. హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్ కు పిలిచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఇందుకు నిరసనగా మునుగోడులోని చౌటుప్పల్ మండలం నాగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసామని తెలిపారు. చావుడప్పుతో బీజేపీ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆ దిష్టిబొమ్మకు నిప్పంటించి దహనం చేసారు.
Kishan Reddy: ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ? మంత్రి అయింది ఎక్కడ? బ్రోకరీజం చేసింది ఎవరు?

Exit mobile version