తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత కేంద్రం ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చేరిగారు కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఖండిస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంను రద్దు చేస్తే అందరం కలిసి ఎన్నికలకు పోదాం అని కేసీఆర్ అన్నారన్నారు. ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు అని కేసీఆర్ చెప్పారని మంత్రి తలసాని వివరణ ఇచ్చారు.
TS Eamcet : ఎంసెట్ యథాతథం.. ఈ సెట్ వాయిదా పడే అవకాశం
అంతేకాకుండా.. కానీ బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు. పోడు భూముల సమస్య తీర్చాలీసింది కేంద్ర ప్రభుత్వమని, పోడు భూములపై విపక్షాలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్క లక్ష రూపాయలు అయిన ఖర్చు పెట్టారా..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. బీజేపీ ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీ అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్న వారు అంతా అవుట్ డేటెడ్ అంటూ ఆయన సెటైర్లు వేశారు.