వినాయక నిమజ్జనం విషయంలో అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. వినాయక నిమజ్జనానికి సరైన ఏ ర్పాట్లు చేయడం లేదని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకుంటే.. ప్రగతి భవన్ వేదికగానే నిమజ్జనం నిర్వహిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఇక, ఈ కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. హైదరాబాద్ నగరంలో, రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 39 వేల గణపతి మండపాలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం పై విసృత ఏర్పాట్ల పై అనేక సార్లు సమీక్షలు జరిగాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పండుగలను గొప్పగా జరుపుకోవాలని నిర్ణయించారు.. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగలను చాలా గొప్పగా జరుపుకున్నాం.. దేశంలో అనేక పండుగలు ఒకలగా జరిగితే, తెలంగాణ రాష్ట్రంలో ఒకలాగా జరుపుతున్నామని తెలిపారు.. ఇవాళ మాట్లాడిన కొంత మంది వ్యక్తులు మాట్లాడారు వెంటనే బతుకమ్మ పండుగ జరుపుతారు. కానీ, వినాయక చవితి పండుగను జరుపరు అని.. కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరిపినట్టు ఎక్కడ కూడా జరుపరు అని స్పష్టం చేశారు.
Read Also: Bandi Sanjay: గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్‌లోనే నిమజ్జనం..!
సమేక్యతను ప్రతిబించేలా ఈ వినాయక చవితి ఉంటుంది అన్నారు మంత్రి తలసాని.. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోసం అనేక ఏర్పాట్లు చేశాం.. చిన్న చిన్న పాండ్ లు ఏర్పాటు చేశాం… అయితే, అవి మురుగు నీరు అంటున్నారని మండిపడ్డారు.. హైదరాబాద్‌లో చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశాం.. నిన్న 5 డేస్ సందర్భంగా చాలా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారని తెలిపారు.. ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం.. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే మేం చేస్తాం అంటున్నారు ఎలా చేస్తారు.. మీరు ఇంత మంది పోలీసులను ఎక్కడ నుండి తెస్తారు..? అని ఎద్దేవా చేశారు. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని హితవుపలికిన తలసాని.. హిందువుల పండుగలను అని అంటున్నారు మరి మేం ఎవరం… మేం స్వతహాగా వినాయకులను పెట్టేవాళ్లం… బోనాలు చేసేవాళ్లం.. కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరిపే వాళ్లం.. పండుగలు చేయాలి అంటే ఎవరైనా చెప్పాలా..? ప్రభుత్వం, మా బాధ్యత అని స్పష్టం చేశారు తలసాని..
మేం ముందే అన్ని ఏర్పాట్లు చేశాం… 3 నెలల ముందే అన్ని ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు మంత్రి తలసాని.. ప్రభుత్వం ఇంత బాగా ఏర్పాటు చేసినందుకు ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్న ఆయన.. ఇలాంటి వాక్యాలు బాధించాయి… అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేసి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామన్నారు.. మరి.. మీరు హిందువులు అంటే మేం ఎవరం? అని నిలదీశారు.. తెలంగాణ రాక ముందు ఇలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అందరికీ తెలుసన్న ఆయన.. గ్రేటర్ పరిధిలో ఉండే వినాయక ఆర్గనైజర్ లతో నేను కోరేది ఒక్కటే అన్ని ఏర్పాట్లను చేశాం.. ప్రభుత్వం మీద బురదజల్లేందుకు అనేక అవాస్తవాలను మాట్లాడారు.. కరోనా వల్ల కొంత ఇబ్బందులు పడ్డాం.. ఈసారి ఘనంగా జరుపుతామని తెలిపారు. ఎవరి ఆరోపణలు పట్టించుకోవాల్సిన పని లేదు.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. ఘనంగా చేశాం ఎవరు ఇబ్బందులు పడాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..