రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేటలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికానన్నారు. ముఖ్యమంత్రి తప్పనిసరిగా స్వాగతం పలకాలనేది ఎక్కడా లేదన్నారు. బీజేపీ నాయకులనుద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలని ఆయన అన్నారు. అనైతిక పొత్తులతో ప్రభుత్వాలను పడగొట్టే పనిలో బీజేపీ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
BJP National Executive Meeting: బీజేపీలో కొత్త జోష్.. తెలంగాణలో కీలక మార్పులు..!
గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ అభివృద్ధి చూడాలన్నారు. దేశ అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రంలో బీజేపీ సిద్ధమైతే మేమూ రెడీ అంటూ తలసాని వ్యాఖ్యానించారు. భారత్ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు ప్రొటొకాల్ అవసరం లేదా?.. సీఎం అవసరం లేదా?.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు హైదరాబాద్‌కు ఎంతోమంది పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు..వీళ్లు అంతేనని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటయిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారని ఆయన విమర్శించారు.
