Talasani Srinivas Yadav: గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఎవరైనా దళితుల అభివృద్ధి గురించి ఆలోచించారా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. హైదరాబాద్ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిచి ఒట్టి చేతులతో పంపారని, నగర అభివృద్ధి కోసం నిధులిస్తే ప్రజలకు మేలు జరిగేదని విమర్శించారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలులో లేదని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలి సూచించారు.
అనంతరం ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు మంజూరైన 27 వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తూ.. వారి కుటుంబాల్లో వెలుగు నింపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిరాదరణకు గురైన దళితులను వృద్ధిలో తీసుకురావడమే లక్ష్యంగా దళిత బంధు అమలు చేస్తున్నమని తెలిపారు. దేశంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎక్కడ జరగలేదని అన్నారు. దళితుల్లో వివక్ష రూపుమాపి ఆర్థిక స్వావలంబన కోసమే ఈ దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకోచ్చారని మంత్రి తలసాని పేర్కొన్నారు.
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్‌కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
దళిత బంధు ద్వారా వచ్చిన వాహనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేసుకోవాలన్నారు మందత్రి సూచించారు. ఇక నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ కార్పొరేటర్ లతో సమావేశమయిన ఈ విషయాన్ని మంత్రి తలసాని ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ కు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తే బాగుండేదని అన్నారు. కార్పొరేటర్ లతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒట్టి చేతులతో పంపడం హాస్యాస్పదమని మంత్రి తలసాని ఎద్దేవ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు వాహనాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/p50bWGKRc7
— Talasani Srinivas Yadav (@YadavTalasani) June 8, 2022
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!