Minister Seethakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు రామప్ప ఆలయ చేరుకొని రామప్ప శ్రీరామ లింగేశ్వరస్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 9.00 గంటలకు ఫౌండేషన్ స్టోన్ అఫ్ బాలసడన్ కు వెళ్ళారు. అక్కడి నుంచి ఉదయం 9:15 గంటకలు ములుగు ఏరియా ఆసుపత్రిలో మిల్క్ ఎక్స్‌ప్రెషన్ గది ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక ఉదయం 9:30 వికలాంగులు మరియు అంగన్‌వాడీ విభాగానికి సంక్షేమ కార్యక్రమ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10:30 గంటకులకు ములుగులోని ప్రభుత్వ కళాశాల మైదానం జనని ఎన్జీవో ద్వారా సంక్షేమ కార్యక్రమం నిర్వహిణలో పాల్గొననున్నారు.
Read also: Sobhan Babu: విశాఖలో శోభన్‌బాబు క్యాంస్య విగ్రహ ఆవిష్కరణ
మేడారం జాతరపై నిన్న మంత్రి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుందని సీతక్క తెలిపారు. ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొ్న్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారని మంత్రి అన్నారు. మేడారం జాతర కోసం అడగ్గానే నిధులు కేటాయించారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు అని అన్నారు. జాతరపై అధికారులకు అన్ని సూచనలు చేశాం.. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం.. శాశ్వత ప్రాతిపదికన చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రానికి కొన్ని పనుల కోసం ప్రతిపాదనలు పంపాము.. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నామని తెలిపారు. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు.
Sobhan Babu: విశాఖలో శోభన్‌బాబు క్యాంస్య విగ్రహ ఆవిష్కరణ