Minister Seethakka: ఎమ్మెల్యే కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ మైండ్ పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విధ్వంసం రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నాడని అన్నారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని తెలిపారు. మీ అహంకారమే మీ ఓటమికి కారణమని అన్నారు. తొమ్మిదేళ్లు గడిలలో ఉండి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యే గెలిచిన ప్రమాణ స్వీకరం చేయడం లేదన్నారు. మాపై మాట్లాడే ముందు కేటీఆర్ కు బుద్ధి మైండ్ ఉండాలా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? అని మండిపడ్డారు. ప్రజలు మావైపే ఉన్నారు, మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Ayodhya : రామమందిరం తర్వాత ఇప్పుడు అయోధ్య ప్లాన్ ఇదే..!
సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారన్నారని తెలిపారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పట్టింది ఎవరు గత ప్రభుత్వం కాదా..! మేము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారని తెలిపారు. చేయకపోతే అవకాశం ఇవ్వరన్నారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చెయ్ ప్రజలు గుర్తిస్తారు, లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారన్నారు. రాజన్న మా ఇలా వేల్పు.. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామన్నారు. ఆది వాసి కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్న ను దర్శించుకోవడం ఆనవాయితీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకి గురి అయిందన్నారు. మా ప్రభుత్వం లో తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు.
PM Modi: బులంద్‌షహర్‌లో ప్రధాని పర్యటన.. పలు అభివృద్ది పనులకు మోడీ శ్రీకారం..