Site icon NTV Telugu

Minister Seethakka : ఆయిల్ ఫార్మ్ పంట రహస్యం చెప్పిన మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : ములుగు జిల్లా మంజీరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క రైతులకు ఆయిల్ ఫార్మ్ పంట ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆయిల్ ఫార్మ్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. 10 ఎకరాల భూమి ఉన్న రైతులు కనీసం ఐదు ఎకరాలలో ఈ పంటను సాగు చేయాలి. ఈ పంటకు ఉన్న గ్యారంటీ మరే పంటకు లేదు” అని తెలిపారు.

రైతుల భారం తగ్గించేందుకు సబ్సిడీతో ఒక్కో మొక్కను రూ.25కే అందిస్తున్నామని ఆమె వివరించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల మేలుకోరే ప్రభుత్వం. రైతులకు దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చిన మొదటి రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే దేశంలోనే మొదటిసారి రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినది కూడా కాంగ్రెస్‌” అని గుర్తుచేశారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్భయ పథకం కింద ఎంపికైన 10 జిల్లాలలో ములుగు జిల్లా కూడా చోటు దక్కించుకుందని, త్వరలోనే జిల్లాలో ఐటీ కంపెనీ శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈ నెల 18న మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసి, శాశ్వత భవనం ఏర్పాటుకు పునాది వేస్తారని వెల్లడించారు. వ్యవసాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పంటలను పండుగలా చేసేందుకు కృషి చేస్తోందని మంత్రి అన్నారు.

Spark of The Paradise: నాని పారడైజ్ జైలు సీక్వెన్స్ వీడియో వచ్చేసింది.. అరాచకం అంతే!

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, “ములుగు జిల్లా ఎప్పటి నుంచో రైతులకు జీవనాధారమైన ప్రాంతం. నేను 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు” అని చెప్పారు. ఉగాది రోజున మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆయిల్ ఫార్మ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు.

“ములుగు జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం. కర్రిగుట్ట ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చుతాం. అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం” అని మంత్రి తుమ్మల అన్నారు.

Dhanush-Mrunal Thakur :ధనుష్ తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన మృణాల్..

Exit mobile version