హైదరాబాద్ నడిబొడ్డున దారుణమైన ఘటన అందరినీ కలచివేసింది.. ఆరేళ్ల చిన్నారపై అత్యాచారం, హత్య ఘటన కలకలం సృష్టిస్తోంది.. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.. పోలీసులు, అధికారులు ఎవ్వరూ చెప్పినా వినకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు.. వారి ఆందోళనతో హైదరాబాద్ – నాగార్జున సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో.. ఇతర రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు పోలీసులు.. మరోవైపు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న ఆమె.. బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణం రూ.50వేల ఆర్ధిక సాయం ప్రకటించారు.. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్లతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దోషులు ఎంతటివారైన ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టం చేశారు.. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్.