NTV Telugu Site icon

Legal Notices: మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్‌ నోటీసులు..

Pado Kowshikreddy

Pado Kowshikreddy

Legal Notices: ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పలు న్యూస్ ఛానెల్స్, పత్రిక లకు లీగల్ నోటీసులను అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు జారీ చేశారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుంది..అది వినియోగించుకోవడానికి వీలుండదన్నారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారన్నారు. ఈ ఫ్లే యాష్ ను రోడ్ల నిర్మాణానికి ,బ్రిక్స్ తయారీ కి ఉపయోగిస్తారని తెలిపారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుందన్నారు. ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందన్నారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగల్సింది పోయి హుజురాబాద్ లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి గారిపై ఆరోపణలు చేశారని తెలిపారు.

Read also: Delhi Water Crisis : దీక్షకు దిగిన మంత్రి అతిషి.. ఢిల్లీకి హర్యానా మరింత నీటిని తగ్గించిదని ఆప్ ఆరోపణ

కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీల్లో ఓవర్ లోడ్ తో వెళ్తుందని ప్రతి లారికి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. ఫ్లై యాష్ అనేది రోజుకు వేల మెట్రిక్ టన్నులు వెళ్తుంటాయి..అది అధికారులు చూసుకుంటారు.అది పంపిస్తున్న ఎన్టీపీసీ చూసుకుంటుందని అన్నారు. అది టెండర్ ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారని తెలిపారు. కానీ వ్యక్తిగత కక్ష తో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు గానూ అడ్వకేట్ పూర్ణచందర్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి లీగల్ నోటిసులు జారీ చేశారని తెలిపారు. అది ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్ తో పాటు నమస్తే తెలంగాణ దిన పత్రిక కు కూడా ఈ లీగల్ నోటిసులు పంపించారు.
Bihar : పాతిపెట్టిన బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చిన తండ్రి.. ఆక్సీజన్ పెట్టాలంటూ ఆందోళన

Show comments