NTV Telugu Site icon

KTR: రేపు తొర్రూరుకు కేటీఆర్.. 20 వేల మంది మహిళలతో భారీ బహిరంగ సభ

Ktr

Ktr

KTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం తొర్రూరు పట్టణ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో కేటీఆర్ సమీక్షించనున్నారు. ఆ తర్వాత 20 వేల మంది మహిళలతో భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడనున్నారు. అలాగే అదే రోజు మహిళా దినోత్సవ కానుకగా రూ. 750 కోట్ల వడ్డీలేని రుణాలను చెక్కుల రూపంలో మహిళలకు అందజేయనున్నారు. అలాగే కేటీఆర్ డ్వాక్రా మహిళలకు అభయ హస్తం డబ్బులు అందించనున్నారు.

Read also: Challenge of MLAs: ఎమ్మెల్యేల మధ్య హోలీ చిచ్చు.. ఒకరు మీసం మెలేస్తే మరొకరు తొడగొట్టి

ఈ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరులో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు బైక్ ర్యాలీ, పలు ప్రారంభోత్సవ వేడుకలను పరిశీలించారు. అనంతరం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఏర్పాట్లపై చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి హెలిప్యాడ్, బహిరంగ సభ స్థలం, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేటీఆర్ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Read also:Dubai Dirham: ఏంట్రా మీరు మారరా? పట్టుకుంటున్నా పదే పదే అదేపని చేస్తారేంట్రా?

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. తొర్రూరులో రాష్ట్రస్థాయి వేడుకలకు మంత్రి కేటీఆర్ వస్తున్నారని ఇందులో మొత్తం రూ. మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు మహిళా దినోత్సవం కానుకగా రూ.750 కోట్లు నిధులు ఇస్తున్నారు. రూ. 250 కోట్లు పట్టణ మహిళలకు, గ్రామీణ మహిళలకు రూ.500 కోట్లు అని మంత్రి తెలిపారు. మహిళలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభయ హస్తం నిధి కూడా విడుదలవుతోంది. అలాగే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 5 కోట్ల 10 లక్షలతో మొదటి విడతలో 3 వేల మందికి, విడతల వారీగా పాలకుర్తి నియోజకవర్గంలో 10 వేల మందికి కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి వివరించారు. ఇక కుట్టు శిక్షణ పొందిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు మంత్రి కేటీఆర్ అందిస్తారని మంత్రి చెప్పారు.
Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..