అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఉద్యమ సమయంలో మహబూబాబాద్ వచ్చాను అప్పటి పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ లో.. దారుణమయిన కరువు ఉండేదని తెలిపారు. పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు సీఎం. వర్ధన్నపేట, పాలకుర్తిలో సగం పూర్తి అయిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్ళు రావనుకున్నాను కానీ..కురవి వీరభద్రుడికీ మొక్కుకున్నా అని అన్నారు.