Minister KTR: ఖమ్మంలో కేటీఆర్ పర్యటన.. సత్తుపల్లిలో ప్రగతి నివేదన సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రి కేటీఆర్ తోపాటు పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్లు కొణిజర్ల మండలం అంజనపూరము గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ ఆయిల్ ఫామ్ కంపెనీ కి మంత్రి అజయ్ కుమార్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకుని ఖమ్మంలో 1370 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన, అదేవిధంగా మున్నేరు వల్ల ముంపును అరికట్టేందుకోసం ఆర్ సిసి వాల్ నిర్మాణాలను శంకుస్థాపనలు చేస్తారు అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రగతి నివేదన సభ నిర్వహిస్తారు. ఖమ్మం నుంచి మళ్లీ భద్రాచలం బయలుదేరి వెళ్లి భద్రాచలంలో కరకట్ట నిర్మాణం తొలగింపు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సత్తుపల్లికి వెళ్లి సత్తుపల్లిలో 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకి మంత్రులు కేటీఆర్ పువ్వాడ అజయ్ లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత సత్తుపల్లిలో జరగనున్న భారీ బహిరంగ సభ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటాం.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
షెడ్యూల్ ఇలా..
* 10.45 గంటలకు కాల్వొడ్డుకు చేరుకొని మున్నేరు రివర్ ఫ్రంట్ తీగల వంతెనకు, ఆర్సీసీ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
* 11.15 గంటలకు వీడీవోస్ కాలనీకి చేరుకొని సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు.
* 11.30 గంటలకు కేఎంసీ కార్యాలయానికి చేరుకొని ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న రోడ్లకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు.
* 12 గంటలకు మమత ఆస్పత్రిలోని హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్లో భద్రాచలం వెళ్తారు.
భద్రాచలంలో..
* 12.30 గంటలకు భద్రాచలంలోని టొబాకో బోర్డులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు.
* 12.35 గంటలకు హెలిపాడ్ నుంచి బయలుదేరుతారు.
* 12.40 గంటలకు కూనవరం రోడ్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ దగ్గరకు చేరుకొని కరకట్ట నిర్మాణానికి
శంకుస్థాపన చేస్తారు
* మధ్యాహ్నం ఒంటిగంటకు అంబేద్కర్ సెంటర్లో ఎస్డీఎఫ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 1.15 గంటలకు కేకే ఫంక్షన్ హాల్లో ప్రెస్మీట్లో పాల్గొంటారు.
* మధ్యాహ్నం 2 గంటలకు సత్తుపల్లికి బయలుదేరుతారు.
సత్తుపల్లిలో..
* మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లి చేరుకుంటారు.
* 2.35 గంటలకు జ్యోతి నిలయం స్కూల్ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 2.45 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబేద్కర్ ఆడిటోరియానికి శంకుస్థాపన చేస్తారు.
* 3 గంటలకు ఎన్టీఆర్ నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 3.15 గంటలకు షాదీఖానాకు, క్రిస్టియన్ భవనానికి, రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
* 3.45 గంటలకు చంద్రా గార్డెన్స్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
* 4.50 గంటలకు సత్తుపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Room Rent: ఏంటి ఒక్క రాత్రికి రూ.14లక్షలా.. అంతలా ఏముందో..!
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!