Minister KTR: నేడు సిరిసిల్లకు కేటీఆర్..1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ముందుగా జిల్లా తంగళ్లపల్లి మండలం వ్యవసాయ కళాశాలలో ఉదయం 11 గంటలకు బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి జిల్లా సమీకృత కలెక్టరేట్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు 124 మంది చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేస్తారు.
Read also: Earthquake: ఐస్లాండ్ రాజధాని చుట్టూ ఒకే రోజులో 1600 భూకంపాలు..
Also Read
సిరిసిల్ల బీఆర్ఎస్వీ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ తండ్రి ఇటీవల మృతి చెందగా, మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామం విలాసాగర్‌కు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా.. బుధవారం పద్మనాయక కల్యాణ మండపంలో పట్టాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, ఖేమ్యానాయక్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Astrology: జూలై 06, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!