Site icon NTV Telugu

KTR: దేశ ఖ్యాతిని చాటిన రెజ‌ర్లకు ఇచ్చే గౌర‌వం ఇదేనా?

Ktr

Ktr

KTR: జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజర్ల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ ప్రజలు రెజర్లను ఆదుకోవాలి. వారిని మనమందరం గౌరవించాలని కేటీఆర్ కోరారు. రెజర్లను ఢిల్లీ పోలీసులు లాగుతూ వుంటే మరో వ్యక్తి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ రెజర్లకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? అంటూ ప్రశ్నించారు. దేశ ఖ్యాతిని చాటిన రేజర్లపై అంత కర్కసం చూపించడం ఏంటని మండిపడ్డారు. రెజర్లకు మద్దతు తెలిపారు. రెజర్లపై నిన్న ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట చేస్తున్న వీడియోను ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆదివారం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక బలగాలు కఠినంగా వ్యవహరించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలనే డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనంలో ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా మరియు ఇతర నిరసనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. రెజ్లర్లపై కేసులు నమోదు చేశారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతోందని వినేష్ ఫోగట్ ఆక్షేపించారు.
Hrithik Roshan: గురువు గారు… ఆయన ముందు ఈయన కనిపిస్తాడంటారా?

Exit mobile version