NTV Telugu Site icon

KTR Tweet: సూపర్‌ రామన్న హీరోలా ఉన్నావ్‌.. కేటీఆర్‌ పై నెటిజన్ల ప్రశంసలు

Ktr Tweet

Ktr Tweet

KTR Tweet: అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అస్సలు మారే ఛాన్సే లేదు. ఇది మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫోటో మనకు చెప్పేది. ఎప్పటికీ అందరిని గుండెల్లో చెదరని మనిషిగా చోటు సంపాదించుకున్న కేటీఆర్‌. ఇరవై సంవత్సరాల్లో తను దిగిన ఫోటోను.. ఇప్పటి ఫోటోను జత చేస్తూ షేర్‌ చేశారు. 2010 లో బ్లాక్‌ టీషర్ట్‌ వేసుకుని వీ నెక్‌ తో చెదిన జుట్టుతో స్మైల్‌ చేస్తూ వున్న ఫోటో లో యంగ్‌ హీరోలా ఉన్నాడు. అయితే ఆఫోటోకు జత చేస్తూ మరో ఫోటోను షేర్‌ చేశారు. అందులో కేటీఆర్‌ ఓసభలో నిలబడి వున్నట్లు వుంది. బ్రింజాల్‌ కలర్‌ వున్న టీషర్ట్‌ ను వేసుకుని నవ్వుతూ పెదవులపై బొటన వేలు పెట్టుకుని చినవ్వులు చిందుస్తున్నట్లు ఆఫోటోలోవుంది. అయితే అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం మార్పులేకుండా వున్న ఆఫోటో ఫోజులు షేర్‌ చేస్తూ.. (Throwback) వెనక్కి వెళితే.. అంటూ 20 సంవత్సాల వెనక మరియు ఇప్పుడు అంటూ స్మైలీ ఇమోజీని పెడుతూ # ఆష్‌ ను జతచేస్తూ పోస్ట్‌ చేశారు.

Read also: Naga Shaurya: కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాగశౌర్య.. బడ్జెట్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే

దీంతో ఈఫోటో కాస్త వైరల్ గా మారింది. ఉదయం 7.41నిమిషాలకు గుడ్‌మార్నింగ్‌ అంటూ పోస్ట్‌ చేసినట్లు అనిపిస్తుంది. గతాన్ని తలుచుకుంటూ ఇప్పటికి అప్పటికి తేడాను తన రాష్ట్ర ప్రజలతో షేర్‌ చేసుకున్నారు. మంచి, చెడు ఏ విషయమైనా సరే రాష్ట్ర ప్రజలతో పంచుకుంటూ వారి ఆనందాన్ని పంచుకుంటూ, కామెంట్లకు సమాధానం ఇస్తుంటారు కేటీఆర్‌. మరి ఈ ఫోటోను చూసిన వారైతే వావ్‌ కేటీఆర్‌ అన్న ఎవర్‌ గ్రీన్‌ మీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆసమ్‌ అన్న నువ్వు మరికొందరు. రామన్న నువ్వు సూపర్‌ అంటూ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారలేదు నువ్వు ఎంగ్‌ హీరోవి అన్నా అంటూ నెటిజన్లు పొగడ్తలతోముంచెత్తుతున్నారు. యంగ్‌ రెబల్‌ స్టార్‌, డార్లింగ్‌ గాలా ఉన్నావన్నా అంటూ మంత్రి కేటీఆర్‌ కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్‌ చేసిన ఈ ఫోటో ట్విటర్‌లో వైరల్ గా మారింది.

Show comments