Naga Shaurya: కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాగశౌర్య.. బడ్జెట్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Shaurya: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు నాగశౌర్య. తాజాగా తన కొత్త సినిమాను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. నాగశౌర్య కెరీర్లో ఇది 24వసినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలు పెట్టనుంది. కాగా తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Read Also: Kamal ‘Indian2: విశ్వ నటుడికి విషెష్‌తో ఇండియన్ 2పోస్టర్ రిలీజ్.. స్టైల్ మామూలుగా లేదు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
విశిష్ట అతిథుల సమక్షంలో నాగశౌర్య 24వ సినిమా ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్.. ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్‌ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. నాగ శౌర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా NS24 రూపొందబోతుంది. హేరిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఛలో సినిమా తర్వాత నాగశౌర్యకు సరైన హిట్ లేదు. ఇటీవలే ఈ యంగ్ హీరో ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ప్రస్తుతం నాగశౌర్య కమర్షియల్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
#NS24 has been officially launched Today with a formal Pooja Ceremony🪔
🎬 #VVVinayak
1st shot #KishoreTirumala
📽️ @AbhishekOfficl
📃#Samba #SantoshKumar🌟ing @IamNagashaurya@Arunachalam_SS @Jharrisjayaraj @vetrivisuals @vaishnavi_films #SrinivasaRao #VijayKumar #AshokKumar pic.twitter.com/eoFffO70jz
— BA Raju's Team (@baraju_SuperHit) November 6, 2022
- Tags
- #NS24
- Naga Shourya
- new movie
- Pooja
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!