NTV Telugu Site icon

KTR: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి

Minister Ktr

Minister Ktr

KTR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. విస్తీర్ణంలో హైదరాబాద్‌ కన్నా సింగపూర్ చిన్నగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..చిన్న చిన్న దేశాలన్నీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ గా ఉన్నాయన్నారు. హైదరాబాద్ కంటే చిన్న దేశం సింగపూర్ 3ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉందని తెలిపారు. ప్రతి ప్రభుత్వానికి ప్రజలపై బాధ్యత ఉంటుందన్నారు. నేషనల్ అవరేజ్ 1.40లక్షల రూపాయలు మాత్రమే ఉంటే తెలంగాణది 2014 లో 1.24 లక్షలు ఇప్పుడు 2.78 లక్షల ఫర్ క్యాపిటల్ ఉందన్నారు. 4.6 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ చేరుకుందని అన్నారు మంత్రి.

Read also: Talasani Srinivas Yadav: ఇకపై చెప్పడం ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటాము

జీడీపీలో 5% తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఉందని తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రోత్ ఈ మూడు సూత్రాలను మేము పాటిస్తున్నామన్నారు. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. పదిహేను రోజులు దాటితే సంబంధిత అధికారికి రోజుకు వెయ్యి ఫైన్ వేస్తున్నామన్నారు. 75 ఏళ్ళల్లో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. 2.1 మిలియన్ పైగా డైరెక్ట్ జాబ్స్ పరిశ్రమలు వచ్చాయన్నారు. 1/3 వ్యాక్సిన్స్ హైదరాబాద్ లొనే తయారవుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఉందని, ఐటీ, అగ్రికల్చర్ గ్రోత్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా అందరికి వాటర్ అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం మేము కట్టామన్నారు. త్వరలోనే కేసీఆర్ నాయకత్వంలో 15 ట్రిలియన్ ల ఎకానమీకి తెలంగాణ చేరుకుంటుందని కేటీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Crime News: కూతురి స్నేహితురాలిపై అత్యాచారయత్నం.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు