Minister KTR: నేను చేయాలనుకుంటున్న పనులు ఇవే.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ సమీపిస్తోంది. దీంతో పాటు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ ప్రచారంలోకి దూసుకుపోతుంది. నియోజకవర్గంలో అభ్యర్థుల తరపున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరంతా బహిరంగ సభలు, వీధి సభలు, రోడ్ షోల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చెప్పి ఆశీర్వదించాలన్నారు.
ఇక మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. సమయాన్ని వృథా చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ బీఆర్‌ఎస్ అభివృద్ధి పనుల గురించి నెటిజన్లకు తెలియజేస్తున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ ఆసక్తికర విషయాలు చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఈ పదేళ్లలో హైదరాబాద్‌కు చేయని మొదటి మూడు పనులు ఏమిటి? అని ఓ నెటిజన్ మంత్రిని ప్రశ్నించారు. కేటీఆర్ స్పందిస్తూ…1) మూసీ సుందరీకరణ, 2) అర్బన్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ మెరుగుదల, 3) రాబోయే 10 సంవత్సరాలలో 415 కి.మీ వరకు మెట్రో కనెక్టివిటీ (రాబోయే 5 సంవత్సరాలలో కనీసం 250 కి.మీ)గా చెప్పారు. తొలి ప్రాధాన్యతతో ఈ పనులను పూర్తి చేస్తానని కేటీఆర్ వెల్లడించారు.
Also Read
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే ఏ శాఖను చేపడతానన్న అంశంపై ఇటీవల మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే టూరిజం శాఖ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరతానని కేటీఆర్ వెల్లడించారు. గత ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ సాధించలేని అభివృద్ధిని బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో సాధించిందన్నారు. తెలంగాణకు అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్నాయని, భారీ రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత తెలంగాణ మరింత మెరుగుపడిందని కేటీఆర్ అన్నారు. , తెలంగాణలో వైద్య, ఆధ్యాత్మిక, క్రీడలు, అటవీ పర్యాటక రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యాటక శాఖను అడుగుతామన్నారు.
Israel-Hamas War: ఆరని యుద్ధ జ్వాలా.. హమాస్ సీనియర్ నాయకుడు మృతి..
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!