KTR: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ఆనందం వ్యక్తం చేసిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ పెట్టుబడులను రాబట్టడంలో సఫలం అవుతోంది.. ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖకు సంబంధించిన అధికారులు విదేశాల్లో పర్యటించి మరీ.. వివిధ కంపెనీలను ఆహ్వానించడంతో.. భారీగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి.. తాజాగా మరో భారీ పెట్టబడి హైదరాబాద్‌కు రాబోతోంది.. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయానికి వచ్చింది.. ఆ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కె. తారక రామారావు… హర్షం వ్యక్తం చేశారు..
Read Also: Trendy Beggar: ట్రెండ్ మారింది గురూ..! ఈ బిచ్చగాడిని చూస్తే ఔరా అనాల్సిందే..!
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
సాఫ్రాన్ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్‌వో ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణయించిందన్న ఆయన.. హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్‌వో ప్రపంచంలోనే పెద్దదని పేర్కొన్నారు.. ఇక, ఓ ప్రపంచ స్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్‌వో ఇదేనని.. ఎంఆర్‌వో, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి 150 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1,200 కోట్లు అని వెల్లడించారు.. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో 800 నుంచి 1000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు కేటీఆర్.. ఇది భారతీయ మరియు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థలు ఉపయోగించే మార్కెట్ లీడింగ్ లీప్ 1ఏ మరియు లీప్ 1బీ ఏరో ఇంజిన్‌లకు సేవలు అందించనుంది.. ఈ ఇంజిన్ ఎంఆర్‌వో ప్రాజెక్ట్ తెలంగాణలోని స్థానిక ఏరోస్పేస్ తయారీ మరియు ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నాం.. ఈ పెట్టుబడితో, హైదరాబాద్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఏరోస్పేస్ వ్యాలీకి దోహదపడుతుందని ఎరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారబోతుందని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Jubilant to welcome @SAFRAN group’s decision to select Hyderabad for its Mega Aero Engine MRO in India
This will be SAFRAN’s largest MRO globally and will be the first Engine MRO established by a global OEM in India pic.twitter.com/gzYdfe4SB3— KTR (@KTRBRS) July 6, 2022
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!