NTV Telugu Site icon

కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెప్పాలి.. కేటీఆర్ పిలుపు..

ktr

కాంగ్రెస్, బీజేపీ నేత‌లు అభివృద్ధి నిరోధ‌కులుగా మారారు.. వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్ర‌శ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్ర‌శ్నించారు.. ఈనాడు తెలంగాణ లో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింద‌ని పేర్కొన్న ఆయ‌న‌.. ఈ వానాకాలం సీజన్‌లో కూడా రైతు బంధు సాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు.. ఇప్పటి వరకు అన్ని సీజన్ల‌లో కలిపి 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద రైతులకు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్ర‌శంసించిన ఆయ‌న‌.. సమైక్యాంధ్ర పాలనలో రైతులు అనేక అవస్థలు ప‌డ్డారు.. కానీ, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అల్ టైం హై దిగుబడులు సాధించి గొప్ప పెరును సంపాందించింది.. తెలంగాణకే నల్గొండ జిల్లా దిక్కూచిగా నిలిచింద‌ని తెలిపారు..

ఇక‌, ఎఫ్‌సీఐ లెక్కల్లో దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నరాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సాధించింద‌న్నారు మంత్రి కేటీఆర్.. గతంలో 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించేవారు.. ఇప్పుడు కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరి పండుతుంది.. ఇది మన ఘనత అన్నారు.. రైతుకు పెట్టుబడి సాయం చేయాలని దేశంలో ఏ నాయకునికి కనీస ఆలోచన రాలేద‌న్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో వ్యవసాయం పండుగలా మారింద‌ని.. రైతులు సంఘటితం కావాలని, బాగు పడాలని రైతు వేదికలను నిర్మించార‌ని.. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.. పండించిన ప్రతి గింజను కొంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసింద‌ని.. ఇది అంతా గ‌మ‌నించాల‌న్నారు.. ఇక‌, నకేరేకల్ లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంద‌న్న ఆయ‌న‌.. మున్సిపల్, ఎమ్మార్వో కార్యాలయల నిర్మాణానికి కృషి చేస్తాం.. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.