Site icon NTV Telugu

TRS vs BJP: కేటీఆర్‌ కౌంటర్‌ ఎటాక్.. విశ్వగురు ఉచితాలు వద్దంటారు.. జోకర్‌ ఎంపీ ఫ్రీ ఫ్రీ అంటారు..!

Ktr

Ktr

టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య తెలంగాణలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఉచితంగా విద్య, వైద్యం, విద్య ఇస్తామంటూ.. బుధవారం రోజు బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్ ఇచ్చిన హామీలపై ఘాటుగా స్పందించారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్… బండి సంజయ్ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఎటాక్‌కు దిగిన ఆయన.. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా ఉందన్నారు.. ఉచితాలు వద్దని ఓ పక్క విశ్వగురు (నరేంద్ర మోడీ) చెబుతుంటే.. మరోపక్క విద్య, వైద్యం, ఇంళ్లు ఫ్రీగా ఇస్తామని ఈ జోకర్‌ ఎంపీ హామీలుస్తున్నాడంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు..

Read Also: SBI: షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఎస్బీఐ.. ఈఎంఐలు మరింత భారం..!

ఇక, ఈ దేశాన్ని బీజేపీ పాలించడం లేదా అని ప్రశ్నించారు? కేటీఆర్‌… ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం అందిస్తామంటే మిమ్మల్ని ఎవరు ఆపారని నిలదీసిన ఆయన.. తెలంగాణ బీజేపీ ఇస్తున్న ఉచిత హామీలపై పార్లమెంటులో చట్టం చేయాలని ట్విట్టర్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్‌ చేశారు.. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న పేదలకు విద్య, వైద్యం, ఇండ్లు ఉచితంగా ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తే పార్లమెంట్‌లో తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని.. అనుకూలంగా ఓటు కూడా వేస్తామని తెలిపారు..

Exit mobile version