Minister KTR : పీయూష్ లజ్జ లేకుండా ప్రకటనలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్వీట్ పెట్టారు, రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని, ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్ ధరలను పెంచుతున్నారని, వరిని గతంలో కొన్నట్లు కొనమని కేంద్రాన్ని కొరినం.. పీయూష్ గోయల్ ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదు… మీ ప్రజలకు నూకలు తినిపియ్యడం నేర్పించాలని అవమనించాడని ఆయన మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం దేశం నుంచి కోటి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుందని, పీయూష్ గోయల్ లజ్జ లేకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సీజన్ మొదట్లోనే వరి పంట వేయొద్దని మేము చెప్పినమని, బండి సంజయ్ ఢిల్లీలో పరపతి ఉన్నట్లు వరి వేయండి మేము కొనిపిస్తాం అన్నాడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాయిల్ రైస్, రా రైస్ అయినా కొంటారని చెప్పినారన్నారు. నమ్మించి మోసం చేసే బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పినా వినక కొందరు వరి వేశారని, తెలంగాణలో బీజేపీ నాయకుల హడావుడితో రైతులు ఆగమాగం అయి 35 వేల ఎకరాల్లో వరి వేశారన్నారు. అచ్చెదిన్ దివాస్ రోజు పార్లమెంట్ లో పీయూష్ గోయిల్ వడ్లు కొనమని చెప్పిండని, వాళ్ళ మంత్రి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడికు తెలియదా అని అడుగుతున్నా అని ఆయన ప్రశ్నించారు. పీయూష్ గోయల్‌కు బలుపు, ఢిల్లీ బీజేపీ ఒక మాట సిల్లి బీజేపీ ఇంకోటి చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తెలంగాణ ప్రజలను నూకలు తినమన్న బీజేపీ నాయకులకు నూకలు లేకుండా చేద్దామని, పై మోడీ కింద బోడి అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారని, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే పని చేస్తున్నారన్నారు.
8వ తారీఖున తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలి, ప్రతి ఊర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయాలే అంటూ ఆయన పిలుపునిచ్చారు. 11వ తారీఖున ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!