KTR Chitchat: మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని కేటీఆర్‌అన్నారు. టికెట్ల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని తెలిపారు. మూడోసారి కూడా కేసీఆరే తెలంగాణ సీఎం కావడం ఖాయమన్నారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక పార్టీని అధికారంలో నుంచి దించడానికి బీఆర్‌ఎస్ రాలేదని తెలిపారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ఉన్నాయనే ఆలోచన విధానం తప్పు కేటీఆర్ అన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ను వదిలేసి ఎన్జీవోను గానీ, దుకాణాన్ని గానీ నడుపుకోవాలని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం, హోంమంత్రి అమిత్ షా టార్గెట్ గా మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 90-100 సీట్లు గెలుస్తాం. తెలంగాణలో బీజేపీ ఉనికిని కోల్పోతుంది. దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందంటే అందుకు కారణం బీజేపీయే. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుండగా.. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఓ వైపు ఒవైసీ మనపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు బాగున్నాయి. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు అంగీకరించాలి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది.
Rahul Gandhi: నాకే ఎక్కువ శిక్ష పడింది.. ఇలా జరుగుతుందని ఊహించ లేదు
