Site icon NTV Telugu

KTR: మోదీ జీ.. మీరు గుజరాత్‌కే కాదు.. భార‌త‌దేశానికి కూడా ప్ర‌ధానే

Modi Kktr

Modi Kktr

ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ జీ.. మీరు గుజరాత్ కే కాదు భారత దేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు.  ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడిక‌ల్ కాలేజీని కూడా మంజూరు చేయ‌లేద‌న్నారు. కేంద్రం చ‌ర్య‌తో వైద్య విద్య‌కు దూర‌మ‌య్యే యువ‌త ప‌రిస్థితి ఏంట‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌గ‌తిశీల రాష్ట్ర‌మైన తెలంగాణ‌పై వివ‌క్ష ఎందుకు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

అయితే గుజ‌రాత్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌రై ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌తో సంభాషించారు. ఈ సంద‌ర్భంగా ఆయుబ్ ప‌టేల్ అనే వ్య‌క్తిని మోదీని ప‌లుక‌రించ‌గా, త‌న కూతురు ఆశ‌యాన్ని ప్ర‌ధాని ముందుంచారు ఆయ‌న‌. త‌న బిడ్డ భ‌విష్య‌త్‌లో డాక్ట‌ర్ కావాల‌ని కోరుకుంటుంద‌ని తెలిపారు. ఎందుకు డాక్ట‌ర్ కావాల‌నుకుంటున్నావ‌ని ఆయుబ్ ప‌క్క‌నే ఉన్న కూతురిని మోదీ ప్ర‌శ్నించాడు. మా నాన్న అనుభ‌విస్తున్న స‌మ‌స్యే కార‌ణ‌మ‌ని ఆమె చెప్పి బోరున విల‌పించింది. సౌదీలో ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఐ డ్రాప్స్ వేసుకోవ‌డంతో కంటి చూపును కోల్పోయాడ‌ని చెప్పింది. మిగ‌తా వారిలా ఆయ‌న స్ప‌ష్టంగా చూడ‌లేక‌పోతున్నార‌ని ఆ యువ‌తి చెప్ప‌డంతో మోదీ కూడా భావోద్వేగానికి లోనై.. భ‌విష్య‌త్‌లో ఆమె క‌ల‌ను నెర‌వేర్చేందుకు త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తాన‌ని మోదీ ప్ర‌క‌టించారు. ఈ వీడియోను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ.. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడిక‌ల్ కాలేజీని కూడా మంజూరు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. కేంద్రం చ‌ర్య‌తో వైద్య విద్య‌కు దూర‌మ‌య్యే యువ‌త ప‌రిస్థితి ఏంట‌ని కేటీఆర్ ట్విట్టర్ ద్వాారా ప్ర‌శ్నించారు.

Exit mobile version