Site icon NTV Telugu

KTR Tweet: డీప్‌ఫేక్‌ పై కేటీఆర్ ట్విట్.. ఏమన్నారంటే..

Minister Ktr

Minister Ktr

KTR Tweet: డీప్‌ఫేక్‌లపై బీఆర్‌ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్‌ను మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఓటింగ్ సమీపిస్తున్న కొద్దీ చాలా డీప్‌ఫేక్‌లు ఉండవచ్చని హెచ్చరించారు. ఓటమి అంచున ఉన్న స్కాంగ్రెస్ డీప్‌ఫేక్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. దీంతో.. బీఆర్‌ఎస్‌ సైనికులు అప్రమత్తతో ఉండి ఓటర్లను చైతన్యపరచాలని ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా సూచించారు.

Read also: Assam: అస్సాంలో రూ.7.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

తాజాగా.. ఫేక్ డీపీ మహిళలకు మాత్రమే కాదు రాజకీయ నేతలకు సైతం ప్రమాదమే కేటీఆర్ అన్నారు. మా ప్రత్యర్థులు ఫేక్ డిపి వాడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సిక్ గా తయారవుతోందని తెలిపారు. మా ప్రతిపక్షాలు మాపై సోషల్ మీడియాని వాడుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్సార్ తో కల్సిసి సైబర్ క్రైమ్ లేజిస్లేషన్ తయారు చేస్తున్నామన్నారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదన్నారు. మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ లైన్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అనుకుంటున్నామన్నారు.

మహిళలు తమ వివరాలు చెప్పకుండానే కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవచ్చు, మెంటల్ హెల్త్ సహాయం అందిస్తారని తెలిపారు. ప్రతి పక్షాలకు కూడా మేమే గెలుస్తామని తెలుసు కానీ వాళ్ళు నటిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 15 లోపు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక అజెండా మీరే తయారు చేయండి అని తెలిపారు. అమలు చేయడానికి ప్రయత్నిద్దామన్నారు. రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు.. రావాలి కూడా.. అన్నారు. రక్షణ పరంగా ఇప్పటికే షి టీమ్స్ , టోల్ ఫ్రీ నంబర్ లాంటివి తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు.
BRS Public Meeting: రేపు పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ రద్దు.. కారణం ఇదే..

Exit mobile version