BRS Public Meeting: రేపు పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ రద్దు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Public Meeting: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిరోజూ మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించడంతో పాటు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు చేరవేస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం కొద్దిరోజులే ఉండటంతో పార్టీ శ్రేణులు అన్నీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇందులోభాగంగా రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారం రోజులు ముందే షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులే ఉండటంతో బీఆర్ఎస్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే నిన్నటి నుంచి నగరంలో వర్షం పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంకా మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రేపు పరేడ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ సభ రద్దైంది.
Read also: Karnataka: బ్రాహ్మణ విద్యార్థికి గుడ్డు తినిపించిన విద్యాశాఖ.. విచారణలో తేలిన నిజం
Also Read
ఎన్నికల ప్రచారానికి వర్షం అడ్డంకిగా మారడంతో పార్టీ శ్రేణుల్లో గుబులు నెలకొంది. ఒక వైపు ప్రచారానికి సమయం కొద్దిరోజులు ఉండటం.. మరోవైపు వర్షం కురుస్తుండటం ప్రచారానికి అంతరాయం కలిగింది. చలితో ప్రజలకు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల్లో నాయకులు ప్రచారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం చూస్తే చలి.. మధ్నాహ్నం చూస్తే వాన జల్లులు దీంతో ప్రచారానికి తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అయితే ప్రచారానికి వాన గండంగా మారిందనే చెప్పాలి. ఇక ఈ కొద్దిరోజుల్లో చలి, వానతో తట్టుకుంటూ ప్రచారం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న సభకు, సమావేశాలకు ప్రజలకు తరలివస్తారా? అనేది పార్టీ శ్రేణుల్లో గుబులు నెలకొంది. దీంతో నాయకులకు వర్షం తలనొప్పిగా మారింది. అయితే బీఆర్ఎస్ సభకు పరేడ్ గ్రౌండ్‌లో సమావేశం నిర్వహించేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మరి వాన వల్ల బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ రద్దవడం.. మరి షెడ్యూల్ లో మార్పు ఏమైన ఉందా? అనే విషయం ఇంకా ఖరారు కాలేదు.
Assam: అస్సాంలో రూ.7.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?