నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో రూ.170 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసగించారు. పల్లెలో నర్సరీ, రైతు వేదికలు, ఇంటింటికీ నల్లా, ట్రాక్టర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. కరెంటు సమస్య తీరింది, 24గంటలు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనేనని ఆయన వెల్లడించారు. కృష్ణా నీటి వాటాను కేంద్రం తేల్చలేదని, నార్లాపూర్, ఏదుల, కర్వెన, ఉధండాపూర్ ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం చేస్తామని ఆయన వెల్లడించారు. డబుల్ బెడ్రూం,పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త పించన్లు ఇస్తామని ఆయన తెలిపారు. చాలా మంది అడ్డం, పొడవు చెప్తరని, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే ప్రభుత్వం టీఆర్‌ఎస్ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అమలుకాని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మర్రి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.
లక్ష మెజారిటీతో గెలిపించుకోవాలని, సొంతంగా స్కూళ్లు, పెళ్లిళ్లు చేస్తున్నడు.. ప్రజలపై ప్రేమ ఉంటే ఎట్లా ఉంటదో మీ మర్రిని చూసి గర్వపడాలి.. వెజ్, నాన్ వెజ్ మార్కెట్.. మిషన్ భగీరథ, మున్సిపల్ కార్యాలయం, గ్రంథాలయానికి భూమి పూజ.. పాలెం సుబ్బయ్య చేసిన పనిని గతంలో పెద్దపెద్ద పదవులు చేసిన వ్యక్తులు చేయకపోవడం సిగ్గుచేటు.. అని మంత్రి అన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన నాయకుడు చేయని పని మర్రి చేసిండని, గతంలో సాగునీరు లేక ఇబ్బంది… ఇప్పుడు 75వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తెలంగాణ వస్తే నాగర్‌కర్నూల్ జిల్లా అయ్యింది, 65ఏళ్లల్లో డిగ్రీ కాలేజీ ఇవ్వకుంటే మెడికల్ కాలేజీ వచ్చిందని ఆయన తెలిపారు. భూగర్భ డ్రెయినేజీ పూర్తి అయ్యిందని, అభివృద్ధి కాంక్ష, తపన, జిద్దు ఉన్న నాయకుడు మర్రి అని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.