తెలంగాణలో లాక్డౌన్..? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మళ్లీ భారత్‌ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు నెటిజన్లు.. ట్విట్టర్లో మరోసారి ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై నెటిజన్ల ట్వీట్లపై కేటీఆర్ స్పందించారు. తమ సుస్థిర, సుపరిపాలనే భాజపా విద్వేష ప్రచారానికి తమ సమాధానమని కేటీఆర్ అన్నారు. భాజపా విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని.. తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసన్నారు. పలు అంశాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు..
Read Also: బుసలు కొడుతోన్న కరోనా.. ఒకేరోజు 2.64 లక్షల కేసులు
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్‌తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
ఇక, అనేక అంశాలపై ప్రశ్నలు సంధించారు నెటిజన్లు.. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా, సమాజ్ వాదీకి మద్దతుగా ప్రచారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నికు బదులిచ్చారు.. మరోవైపు, లాక్డౌన్, నైట్ కర్ఫ్యూపై కూడా మంత్రి కేటీఆర్‌కు ప్రశ్నలు ఎదురయ్యాయి.. దీనిపై స్పందించిన ఆయన.. కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు.. రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.. అయితే, ప్రస్తుతం కర్ఫ్యూ, లాక్డౌన్ లాంటి ఆలోచనలు మాత్రం ప్రభుత్వం లేనట్టుగా తెలుస్తోంది.. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే.. కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కేసులు పెరుగుతూ పోతున్నందున.. సంక్రాంతి హాలీడేస్ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనేదానిపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!