బుసలు కొడుతోన్న కరోనా.. ఒకేరోజు 2.64 లక్షల కేసులు

భారత్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్‌ వేరియంట్‌గా పంజా విసురుతోంది.. దీంతో.. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది… రోజుకో రికార్డు తరహాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ కలవరపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 315 మరణాలు నమోదు, ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,72,073కు చేరింది.. భారత్‌లో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 14.78 శాతానికి చేరినట్టు కేంద్రం బులెటిన్‌లో పేర్కొంది.. కోవిడ్‌ బారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 4,85,350కి చేరింది.. ఇక, కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నవారి గత 24 గంటల్లో 1,09,345గా ఉంది.. మరో వైపు, ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,753కి పెరిగింది…

Read Also: అద్భుతం చేసిన కోవిషీల్డ్‌.. మంచానికే పరిమితిమైన వ్యక్తిని ఇలా లేపింది..!

Related Articles

Latest Articles