Kishan Reddy: సచివాలయం ఓపెనింగ్ కు గవర్నర్ ను ఎందుకు పిలవలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి తెలంగణ గవర్నర్ తమిళిసైని బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌తో బీజేపీ వాదించే పరిస్థితి లేదని అన్నారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ఆపేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కూడా సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని దుయ్యబట్టారు. అలాగే రేపటి నీతి ఆయోగ్ సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరు కావడం దుర్మార్గమైన చర్య. పోరాడి సాధించుకున్న తెలంగాణకు సీఎం కేసీఆర్ వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం రాకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌కు మహారాష్ట్ర వెళ్లే సమయం ఉంది కానీ.. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌లకు పూలమాల వేసే సమయం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఘర్షణ వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు.
అలాగే అవకాశం ఉన్న చోట తెలంగాణ వాణి వినిపించడంతో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వివరించారు. జూన్ 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే బజ్‌మేళాకు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారని కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌లో చేరికలపై మాట్లాడిన కిషన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ పార్టీ తల వాచిపోయిందని మండిపడ్డారు. ఫ్లెక్సీలు కట్టుకుంటే దేశానికి నాయకుడు కాలేడన్నారు. కేసీఆర్ ఎకరాకు 10 వేలు మాత్రమే ఇస్తున్నారని, మోడీ ప్రభుత్వం ఎరువుల సబ్సిడీతో ఎకరాకు 18 వేల 254 రూపాయలు ఇస్తోందని పేర్కొన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నా.. ఎరువుల ధరలు పెరిగినా రైతులపై అదనపు భారం పడడం లేదన్నారు. ఒక్కో బ్యాగుపై ధరలను ముద్రిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీని కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? సీఎం కేసీఆర్ తీరు గురువింద గింజ అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఆకాశానికి ఎగరలేని వారు ఆకాశానికి ఎగిరినట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని మండిపడ్డారు. డిజిటల్ లావాదేవీల్లో భారత్ నంబర్ వన్ గా నిలిచిందన్నారు.
Long Covid Effect: లాంగ్ కోవిడ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలు
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!